Subscribe Us

SB LATEST:

30, జనవరి 2026, శుక్రవారం

నామినేషన్ వేయడానికి ర్యాలీ గా వెళ్లిన ఎన్నికల అభ్యర్థి, బీజేపీ నేతలు

 

నాగర్ కర్నూల్, జనవరి 30,(ఎస్ బి న్యూస్):
మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేయాలి: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
నాగర్‌కర్నూల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ కేంద్రం లో శుక్రవారం రోజు బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం రోజు సామ్స్కృతిక బృందం చేత డప్పు కళా కారుల తో పాటలు పాడుతూ రామాలయం దేవాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్’ పథకం ద్వారా భారీ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ పట్టణ ప్రజలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని గుర్తించి, మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్‌చార్జి దిలీప్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, ఆంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి, నారాయణ చారి, శ్రీశైలం, టౌన్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, జిల్లా కార్యాలయ కార్యదర్శి సి. చందు, జిల్లా కోశాధికారి రాజా రామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చంద్రకళ, తిమ్మాజీ పేట మాజీ ఎంపీపీ జెట్టి వెంకటేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా వర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, యశ్వంతు, శ్రీరాములు, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి, బొట్టు శ్రీను, సత్యనారాయణ, వెంకటేష్, కౌన్సిలర్ అభ్యర్థులు తెప్ప విష్ణు, యాదగిరిరావు, రాధారెడ్డి, శ్రీనాథ్ గౌడ్, పోతుల మమత, నేషా, రుద్రమ్మ, సౌజన్య, రాము తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.