Subscribe Us

SB LATEST:

1, జనవరి 2026, గురువారం

నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు 


పినపాక 

మనం ఒకరి తప్పులను ఒకరు క్షమించి, మొత్తం సమాజంలో ప్రేమ మరియు శాంతి స్థాపించబడాలని నూతన సంవత్సర సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిలలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని ప్రభు వాక్యాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ 
దేవుడు భూమిపై తల్లిదండ్రులను తన స్థానంలో ఉంచాడని, దేవుని ఆశీర్వాదాలను పొందడానికి మనం మన తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. 2026 నూతన సంవత్సరం మన దేశానికి పురోగతి, శాంతి ప్రేమను తీసుకురావాలని ఆయన ప్రార్థించారు. అనంతరం చర్చిలలో సామూహిక భోజనాలు నిర్వహించారు.