Subscribe Us

SB LATEST:

1, జనవరి 2026, గురువారం

మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన సిఐ, ఎస్సై

మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన సిఐ, ఎస్సై 
పినపాక

పత్రికలు సమాజానికి మేలుకొలుపుగా ఉండాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారధిగా పనిచేయాలని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం నూతన సంవత్సర సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం రక్షకభట నిలయంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సురేష్ మన తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి (ప్రజాతంత్ర), ఉపాధ్యక్షులు కట్ట శ్రీను(వార్త), ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ బృహస్పతి (నవ తెలంగాణ), ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు మన తెలంగాణ రిపోర్టర్ నాగేందర్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గంగాధర్, సాక్షి రిపోర్టర్ మహేష్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ శంకర్, ఈనాడు రిపోర్టర్ భాస్కర్, సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిట్ట వెంకటేశ్వర్లు, జగదీష్, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.