పినపాక
నవతెలంగాణ దినపత్రిక ఎల్లప్పుడూ ప్రజాపక్షంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. పినపాక మండల కేంద్రంలో సిపిఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నూప బాపనమ్మతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవతెలంగాణ పత్రికకు , నవతెలంగాణ పత్రికను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
