Subscribe Us

SB LATEST:

24, జనవరి 2026, శనివారం

నేస్తం సేవా ట్రస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

నేస్తం సేవా ట్రస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
-శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ చేతుల మీదుగా ప్రారంభం
 స్వాతంత్ర్య భారత్ న్యూస్ ప్రతినిధి ములుగుమంగపేట మండలం రాజపేట గ్రామానికి చెందిన అమీర్ ఆలోచనతో స్థాపించిన నేస్తం సేవా ట్రస్ట్ ప్రారంభ పోస్టర్‌ను శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తోటి వారికి తనవంతుగా సేవ అందించాలనే లక్ష్యంతో అమీర్ నేస్తం సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నాగ రమేష్ మాట్లాడుతూ, అమీర్‌లోని సేవా గుణం ఈనాటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. నేస్తం సేవా ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయం అందించి, మరెందరో హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు. సేవ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, తోటి మనిషి సహకారం లేకుండా జీవించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారే పరోపకారానికి ముందడుగు వేసి యువతరానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ రామ్మోహన్, రమేష్, సాయి కృష్ణ, బాడిష నవీన్ తదితరులు పాల్గొన్నారు.