నాగర్‌కర్నూల్, జనవరి 19 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
