Subscribe Us

SB LATEST:

19, జనవరి 2026, సోమవారం

గర్భిణీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డాక్టర్ ప్రతాప్

గర్భిణీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డాక్టర్ ప్రతాప్
పినపాక:గర్భంలో ఉన్న శిశువు దినదిన ప్రవర్ధమానం చెందాలంటే గర్భిణీ తల్లి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ప్రతాప్ సూచించారు. సోమవారం పినపాక పీహెచ్‌సీలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భధారణ కాలంలో సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకమన్నారు. తగినంత విశ్రాంతి, ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం, తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే శిశువు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.