జానంపేట పంచాయతీలో అగ్ని ప్రమాదం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉండగా కొమరం నాగేశ్వరరావు అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఇంటి పక్కనే తాత్కాలికంగా పరదా షెడ్ ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అదే షెడ్‌కు నిప్పు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలాన్ని విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ పరిశీలించి, ఇది విద్యుత్ సరఫరా కారణంగా జరగలేదని తెలిపారు. పండగ సమయంలో ఈ విధమైన ఘటన జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు