Subscribe Us

SB LATEST:

13, జనవరి 2026, మంగళవారం

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి : ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు


అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. పేకాట, కోడి పందాలు వంటి జూదాలు చట్టరీత్యా నేరమని, వీటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు, యువత చెడు వ్యసనాలకు లోనై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సేవించడం, రవాణా చేయడం, అమ్మడం లేదా కొనడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేకాట, కోడి పందాల వంటి జూదాలకు అలవాటు పడి నిండు జీవితాలను పాడుచేసుకోవడమే కాకుండా, కుటుంబాలను కూడా రోడ్డుపైకి తెస్తున్నాయని అన్నారు.
గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి వంటి నిషేధిత పదార్థాల రవాణా, విక్రయం లేదా పేకాట, కోడి పందాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలిపారు.
సమాచారం ఇవ్వడానికి సంప్రదించవలసిన నంబర్లు
సీఐ– ఏడూళ్ల బయ్యారం: 8712682097
ఎస్సై– ఏడూళ్ల బయ్యారం: 8712682099 లకు తెలపాలన్నారు.