Subscribe Us

SB LATEST:

6, జనవరి 2026, మంగళవారం

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న ఏఈ వేణుగోపాల్, సర్పంచ్ చందర్రావు


పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వేణుగోపాల్ పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. లూజు లైన్లు, మిడిల్ పోల్స్, లైన్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చర్ సర్వీసులకు సంబంధించిన సమస్యలను రైతుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లపై ఉన్న ఇబ్బందులను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను స్వీకరిస్తామని ఏఈ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం ఎంపీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ వాగబోయిన చందర్రావు, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి, ఈ బయ్యారం సెక్రటరీ జయపాల్ రెడ్డి, స్థానిక రైతులు , విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.