నాగర్ కర్నూల్, జనవరి 10,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాల్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బీజేపీ నాయకులు శనివారం కల్వకుర్తి లో నిర్వహించారు. ఈ సమావేశం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో బీజేపీ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు , కంటెస్టెడ్ ఎమ్మెల్యే తల్లోజు .ఆచారి, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాల్టీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలనిపిలుపునిచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల్లో బీజేపీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని వారు సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
