Subscribe Us

SB LATEST:

10, జనవరి 2026, శనివారం

బూత్ కమిటీల బలోపేతంతోనే బీజేపీ అధికారానికి చేరువ– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు

నాగర్‌కర్నూల్: జనవరి 10(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా లో పార్టీ బలోపేతానికి బీజేపీ ఆధ్వర్యంలో బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని అచ్చంపేట పట్టణంలోని లోటస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జిల్లా ఇన్‌చార్జ్ రాజు హాజరై మాట్లాడారు. రాబోయే అచ్చంపేటతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి విజయ డంక మోగించబోతోందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
బూత్ కమిటీలను పటిష్టంగా నిర్మిస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జ్ రాజు తెలిపారు. అందుకే పార్టీ బలోపేతమే లక్ష్యంగా బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి, సోలంకి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చంద్రకళ, వరికుప్పల ఆంజనేయులు, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.