Subscribe Us

SB LATEST:

9, జనవరి 2026, శుక్రవారం

జిల్లా కేంద్ర ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిడెలివరీ లు - ఒకే రోజులో 23 డెలివరీలు

జిల్లా కేంద్ర ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిడెలివరీ లు 
- ఒకే రోజులో 23 డెలివరీలు
24 గంటల్లో 12 సాధారణ, 11 అత్యవసర సిజేరియన్ ప్రసవాలు

నాగర్ కర్నూల్, జనవరి 09(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్ర వారం రోజు (ఒకే రోజు) 23 డెలివరీలు విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.24 గంటల వ్యవధిలో 12 సాధారణ, 11 అత్యవసర సిజేరియన్ డెలివరీలు జరిగాయని డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీలకు సురక్షిత ప్రసవ సేవలు అందించామని చెప్పారు. మెటర్నిటీ విభాగం వైద్యులు, మిడ్‌వైఫరీలు, నర్సింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందన్నారు.
స్త్రీల వైద్య నిపుణులు డా. నీలిమా, డా. సుప్రియ కీలక పర్యవేక్షణను అందించగా, అసోసియేట్ ప్రొఫెసర్లు డా. సౌమ్య, డా. కవిత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 24 గంటల పాటు సాధారణ, సిజేరియన్ డెలివరీ సేవలు నిరంతరంగా కొనసాగాయి.
విధి నిర్వహణలో డా. అమ్రిన్ షరీఫ్, డా. గంటి శృతి, డా. సనా ఫాతిమా సేవలు అభినందనీయమని తెలిపారు. డెలివరీలకు ప్రత్యేక శిక్షణ పొందిన 9 మంది మిడ్‌వైఫరీ నర్సులు కీలక పాత్ర పోషించారు.
అత్యవసర పరిస్థితుల్లో బీపీ, షుగర్, ఫిట్స్ ఉన్న గర్భిణీలకు ప్రత్యేక చికిత్స అందించామని చెప్పారు. మొదటి, రెండో ప్రసవాలు సిజేరియన్ అయిన గర్భిణీలను ఎంపిక చేసి అవసరమైన వారికి సిజేరియన్ డెలివరీలు నిర్వహించారు.
ఆసుపత్రిలో నెలకు సగటున 400కు పైగా డెలివరీలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం బాలింతలను 102 అంబులెన్స్ సేవల ద్వారా సురక్షితంగా వారి ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. నవజాత శిశువులకు చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు.ఈ కార్యక్రమంలో అనస్థీషియా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్య బృందం అందిస్తున్న సేవలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.