Subscribe Us

SB LATEST:

1, జనవరి 2026, గురువారం

ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న నూతనంగా కొలువు తీరిన ప్రజాప్రతినిధులు

నాగర్ కర్నూల్ జనవరి 01(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వయంభూ దేవుడిగా నల్లమల కొండలలో వెలసి శ్రీ ఉమా మహేశ్వరుని కొండ పై కి వస్తున్న భక్తుల కోరికలు తీరుస్తున్న ఉమామహేశ్వర ఆలయాన్ని 
ఆంగ్ల నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకుని ఉప్పునుంతల మండలంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ, అయ్యవారి పల్లి గ్రామ సర్పంచ్ జిల్లెల జగత్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారికి దేవాలయ చైర్మన్ మాధవ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తమ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు.