జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2026 వ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను గురు వారం రోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం ఒకరి కొకరు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గత సంవత్సరంలో శాఖా పరంగా ఏమైనా తప్పులు తెలిసి తెలియక చేసి ఉంటే వాటిని సమీకరించుకొని అలాంటి తప్పులను నేటి నుంచి ప్రారంభమయ్యే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 లో మళ్లీ జరగకుండా వారి విధులలో భాగంగా భవిష్యత్తులో ప్రజలకు చేరువగా నమ్మకంగా ఉండాలని అధికారులకు ఎంతైనా అవసరం ఉందని అధికారులు సూచించారు.మాట్లాడుకున్నారుఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ అధికారులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత సమర్థంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.
