భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్) లో పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరపరెడ్డి తరుణ్ రెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ భవిష్యత్ కార్య చరణ పై యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ మధ్యాహ్నం 2:00 గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సూరపరెడ్డి తరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ సభ్యులు గ్రామాల వారిగా యూత్ కాంగ్రెస్ బలోపితం చేయడంలో ప్రతి ఒక్కరు గ్రామాల వారిగా తిరిగి కమిటీలు వేయాలని జనవరి 10 లోపల యొక్క కమిటీలు పూర్తి చేసి నియోజకవర్గ వ్యాప్తంగా మీటింగ్ ని నిర్వహించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు, మణుగూరు,అశ్వాపురం బూర్గంపాడు మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహిళ యూత్ కాంగ్రెస్ నాయకుల సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు
నియోజకవర్గ వ్యాప్తంగా మణుగూరు ప్రజా భవన్ లో యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్
