Subscribe Us

SB LATEST:

30, డిసెంబర్ 2025, మంగళవారం

గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా
గుండాల మండలం డిసెంబర్ 30 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడెం ముత్యం చారి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత మరియు ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి మండల అధ్యక్ష స్థాయికి చేరుకున్నానని కొడెం ముత్యం చారి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించిన జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయన నమస్కారం తెలియజేశారు.అలాగే, నాటి నుంచి నేటి వరకు తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా తమతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
రాజీనామా అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన, ఈ రోజు నుండి మళ్లీ సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల తన నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతుందని కొడెం ముత్యం చారి స్పష్టం చేశారు.ఈ రాజీనామా ప్రకటన గుండాల మండల రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.