Subscribe Us

SB LATEST:

2, జనవరి 2026, శుక్రవారం

14వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

14వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
బూర్గంపాడు మండలం జనవరి 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీకి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ ఉపసర్పంచ్ కన్నె దారి రమేష్ 14 వ వార్డు మెంబర్ కొమరం సావిత్రులను ఘనంగా సన్మానించిన వార్డు ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభలో సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు గ్రామపంచాయతీని అన్ని వార్డులలో సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచేందుకు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని ఆ మేరకు పని చేస్తానని అన్నారు వార్డులో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తానని తెలిపారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా అందిస్తామని హామీ ఇచ్చారు రాబోయే కాలంలో ప్రజా పరిపాలన అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తానని భరోసానిచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ సత్కరించినారు ఈ కార్యక్రమంలో 14 15 వార్డుల ఇన్చార్జి గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, బొడ్డు నాగరాజు, హెచ్ఆర్పిఎస్ మండల అధ్యక్షులు దుగ్గంపూడి వెంకటరెడ్డి, స్థానిక నాయకులు వెంకటరామిరెడ్డి, పగడాల మధుసూదన్ రెడ్డి, నవీన్, జరుపల వీరమ్మ, వార్డు లో ఉన్న యువతీ యువకులు మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు