- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలోజూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి మొత్తం 7 మండలాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు.
పోలింగ్ ప్రక్రియ ఒంటి గంటకు ముగియ నుండటంతో అర్హులైన ప్రతి ఓటరు ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.
