కోరం సీతారాములను గెలిపించి ఐక్యతను చాటండి:ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు విసి దొర

కోరం సీతారాములను గెలిపించి ఐక్యతను చాటండి
:ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు విసి దొర


*గుండాల మండలం డిసెంబర్ 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

సబ్బండ జాతుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా కోరం సీతారాములు ప్రజల్లో విశేష గుర్తింపు పొందుతున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు వీసీ దొర పేర్కొన్నారు. ప్రజలకు దూరంగా ఉండే నాయకులను కాకుండా నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నిజమైన ప్రజా నాయకుడినే గెలిపించాలని కోరారు.

కోరం సీతారాములు సంవత్సరాలుగా గ్రామాలు, అడవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఆదివాసీలు, సబ్బండ వర్గాలు ఎదుర్కొంటున్న భూములు, ఉపాధి, విద్య, వైద్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తున్నారని వీసీ దొర తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించగల ధైర్యం ఆయనకు ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకత్వం కాదని, ప్రతిరోజూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండే నేతనే కోరం సీతారాములని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలు వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా సబ్బండ జాతుల భవిష్యత్తు, వారి హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్నాయని వీసీ దొర అన్నారు. ప్రజలు ఐక్యంగా ఆలోచించి, సమాజ అభ్యున్నతికి అంకితమైన నాయకుడిని ఎన్నుకుంటేనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కోరం సీతారాములును గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కార దిశలో బలమైన అడుగు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.