Subscribe Us

SB LATEST:

22, డిసెంబర్ 2025, సోమవారం

లక్ష్మాపూర్ సర్పంచ్ సహాయ నిధికి లక్ష రూపాయల విరాళం

లక్ష్మాపూర్ సర్పంచ్ సహాయ నిధికి లక్ష రూపాయల విరాళం
ఇచ్చిన హామీని ప్రమాణస్వీకారం రోజే అమలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది...వావిలాల జ్యోతి వెంకటేష్ ప్రశంసనీయం

నాగర్ కర్నూల్,డిసెంబర్,22,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటనియోజకవర్గంలోనిఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్ (పీ.జి) గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.గ్రామానికి చెందిన వావిలాల జ్యోతి వెంకటేష్ పాల్గొని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ సహాయ నిధికిలక్షరూపాయలవిరాళాన్నిఅందజేశారు.ఈసందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల.బాలరాజుమాట్లాడుతూ, తన స్వగ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళంఅందజేయడంఅభినందనీయమని వావిలాల జ్యోతి వెంకటేష్‌ను ఆయనప్రశంసించారు.అలాగేనూతనంగాప్రమాణస్వీకారం చేసిన సర్పంచ్ బీసం. గోపాల్, ఉపసర్పంచ్ సామ శాంతమ్మతో పాటు వార్డుసభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులుపాల్గొని లక్ష్మాపూర్ గ్రామ పాలక మండలిని అభినందించారు.