Subscribe Us

SB LATEST:

22, డిసెంబర్ 2025, సోమవారం

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం

విద్యుత్ కు అంతరాయం లేకుండా చూడండి... విద్యుత్ శాఖ ఏఈ ఎమ్మెల్యే పాయం 
పినపాక :విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా అన్ని రకాల చర్యలను అధికారులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పాయం సూచించారు. సోమవారం పినపాక మండల పర్యటనలో భాగంగా ఆయన పాండురంగాపురం గ్రామంలో రైతులతో మాట్లాడారు. అనంతరం ఏఈ వేణుగోపాల్ తో చరవాణి తో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించాలని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం


పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొమరం వెంకన్న ఇటీవల మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వారి కుమార్తెలకు సహాయం అందిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే మృతి చెందడం బాధాకర విషయం అన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, పాండురంగాపురం సర్పంచ్ భవతి ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు