పినపాక మండలం 23 గ్రామపంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం సర్పంచ్ లకు గ్రామ ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ ప్రత్యేక అధికారులు శాలువాతో సర్పంచ్ తో పాటు పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని, గ్రామస్తుల సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారులు ఎంపీడీవో సంకీర్త్, తహసీల్దార్ గోపాల కృష్ణ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు ,మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మండలంలో సర్పంచుల ప్రమాణ స్వీకారం.. బాధ్యతల స్వీకరణ
