విద్యార్థులకు నాణ్యమైన భోజనం పాఠశాలల్లో అందించాలని ఈ బయ్యారం సర్పంచ్ వాగపోయిన చందర్రావు సూచించారు. శనివారం పినపాక మండలం పోతిరెడ్డిపల్లి, ఈ బయ్యారం ప్రాథమిక పాఠశాలలను పరిశీలించి అక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరమైన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ చందర్ రావు
