శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై భక్తుల రద్దీ
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో శని వారం రోజు చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం సెలవు కావడం తో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా 2కిలోమీటర్ ల దూరం వరకు కార్లు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది.
మన్ననూర్ చెక్‌పోస్ట్ వద్ద అమలు చేస్తున్న ప్లాస్టిక్ ఫ్రీ జోన్ నిబంధనల కారణంగా వాహనాల తనిఖీలకు ఎక్కువ సమయంతీసుకుంటుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. శ్రీశైలానికి వెళ్లే భక్తుల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రత్యేకంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ అధికంగా ఉండటంతో ప్రయాణ సమయం గణనీయంగా పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేపట్టారు.
భక్తులు సహకరించాలని, ప్లాస్టిక్ కవర్ల నిషేధ నిబంధనలను పాటిస్తూ ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకుని రావాలని అధికారులు భక్తుల కు సూచించారు.
