Subscribe Us

SB LATEST:

27, డిసెంబర్ 2025, శనివారం

బాలికల విద్యతోనే బంగారు భవిష్యత్తు– జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్


నాగర్‌కర్నూల్, డిసెంబర్ 27
sb న్యూస్):బాలికలు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తులోను అన్ని రంగాల్లో రాణించగలరని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని 
చారకొండ మండల కేంద్రంలో శని వారం రోజు కస్తూరిబా గాంధీ బాలికలవిద్యాలయాన్ని డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్, వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు.విద్యార్థినులకు అందిస్తున్న మెనూ ప్రకారంగా అందిస్తున్నారా లేదా అడిగి తెలుసు కున్నారు. వంటలను స్వయంగా రుచి చూసి, పరిశుభ్రమైన పోషకాహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు.పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతుల్లో గణిత, జీవశాస్త్రం, ఆంగ్ల విషయాల్లో విద్యార్థినుల విద్యా సామర్థ్యాలను ప్రశ్నోత్తరాల రూపంలో తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఉన్న సందేహాలను నివృత్తిచేశారు.విద్యాలయంలో విద్యుత్, తాగునీరు, బాత్రూంల వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించి, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని, విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పాఠశాల పరిసరాలు కూడా పరి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
తరగతుల్లో సబ్జెక్టుల వారీగా అర్థమయ్యే విధంగా బోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధచూపాలనిఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ కేజీబీవీల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రానున్న పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమఫలితాలుసాధించాలని ఆకాంక్షించారు.అంతకుముందు తిమ్మాయిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన డీఈఓ, విద్యార్థులు–ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలాఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా టెక్స్ట్‌బుక్ మేనేజర్ నరసింహులు, కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.