పినపాక: మేడారం జాతరకు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు ఇరువైపులా మార్జిన్ లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తున్నామని భూపాలపట్నం సర్పంచ్ స్వప్న తెలిపారు. శనివారం పినపాక మండలం ఐలాపురం గ్రామ వద్ద పరిశుభ్రత పనులను చేపట్టారు. ఎంపీ ఓ ఆదేశాలతో ప్రతిరోజు శానిటేషన్ పనులు కూడా చేస్తున్నామని సర్పంచ్ తెలియజేశారురు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిట్ట శిరీష, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మేడారం జాతర సందర్భంగా రోడ్డు ఇరువైపులా శుభ్రం చేపిస్తున్న సర్పంచ్
