Subscribe Us

SB LATEST:

27, డిసెంబర్ 2025, శనివారం

రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - హాజరుకానున్న ఎమ్మెల్యే పాయం

రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
- హాజరుకానున్న ఎమ్మెల్యే పాయం 
పినపాక:భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం తెలియజేశారు. శనివారం సాయంత్రం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారని తెలిపారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పిడి నిరసన కార్యక్రమం,ర్యాలీ లో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. కావున కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులకు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉడుగుల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండేరు సంపత్, తదితరులు పాల్గొన్నారు