సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శని వారం రోజు నాగు పాము కనపడ డం తో కార్యాలయం సిబ్బంది
స్నేక్ రెస్క్యూ సుమన్ కు సమాచారం ఇచ్చిన వెంటనే సకాలంలో చేరుకుని స్నేక్ క్యాచర్ సుమన్
అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శని వారం ఉదయం ఒక్కసారిగా కలకలం నెలకొంది. కార్యాలయ ప్రాంగణంలోకి నాగుపాము చొరబడినట్లు గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్నేక్ రెస్క్యూ వాలంటీర్ సుమన్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సుమన్, ఎంతో నైపుణ్యంతో నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో కార్యాలయ సిబ్బందికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం పట్టుకున్న పామును సమీప అటవీ ప్రాంతంలో సహజ వాతావరణంలోవిడిచిపెట్టారు.
జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే, ప్రజలు పాముకాటుకు గురికాకుండా అలాగే పాములకు కూడా హాని కలగకుండా రక్షించాలనే సదుద్దేశంతో స్నేక్ రెస్క్యూ సేవలు అందిస్తున్న సుమన్‌ను స్థానికులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించి ఇలాంటి స్నేక్ క్యాచర్ లు రిస్క్ తీసుకుని ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఇతరుల ప్రాణాలను పాముల బారినుండి రక్షించి కాపాడుతున్న వీరికి పారితోషికం లాగా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ చర్చించు కొంటున్నారు.సుమన్ సకాలంలోస్పందించినందువల్ల పెద్ద ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు.
