Subscribe Us

SB LATEST:

23, డిసెంబర్ 2025, మంగళవారం

చర్ల–జానంపేట మార్గంలో గోవుల తరలింపు... అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్

చర్ల–జానంపేట మార్గంలో గోవుల తరలింపు... అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్ 
- ఆధారాలు చూపించకపోతే కేసులు తప్పవన్న జానంపేట సెక్రెటరీ హుస్సేన్ 
పినపాక :చర్ల నుంచి పినపాక మండలం జానంపేటకు తరలిస్తున్న 34 గోవులను గోరక్షకులు అడ్డుకుని భగ్నం చేశారు. ఈ ఘటనలో విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి చిలకమర్రి లక్ష్మణ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మెడిశెట్టి బాజీ బాబు, భారతీయ జనతా పార్టీ పినపాక మండల అధ్యక్షుడు శివప్రసాద్, దంతులూరి రామచంద్ర రాజు, వెంకటనారాయణ కలిసి గోవుల తరలింపును పట్టుకున్నారు.
వాహనంలో గోవులను కఠిన పరిస్థితుల్లో తరలిస్తున్నట్టు గమనించిన వారు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. ప్రాథమిక పరిశీలనలో గోవులను తరలిస్తు వారిని పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించాలని జానంపేట సెక్రటరీ ఖాజా హుస్సేన్ ఆదేశించారు . సరైన ఆధారాలు చూపిస్తే గోవులను తిరిగి అందజేస్తామని తెలిపారు. గోవులను సురక్షితంగా విడిపించి, తదుపరి చర్యల కోసం పోలీసులకు అందిస్తామని సెక్రటరీ తెలిపారు.
ఈ సందర్భంగా గోరక్షకులు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచాలని డిమాండ్ చేశారు.