Subscribe Us

SB LATEST:

23, డిసెంబర్ 2025, మంగళవారం

గోదావరిలో మృతదేహం... వెంకటాపురానికి చెందిన జయ పాల్ గా గుర్తింపు

గోదావరిలో మృతదేహం... వెంకటాపురానికి చెందిన జయ పాల్ గా గుర్తింపు 
- ములుగు జిల్లా వెంకటాపురంలో మిస్సింగ్ కేసు నమోదు 

పినపాక


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామపంచాయతీ గోదావరిలో మంగళవారం గుర్తు తెలియని శవం కొట్టుకొని వచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జయ పాల్ గా గుర్తించారు. ఈనెల 18వ తేదీన వెంకటాపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మంగళవారం గోదావరిలో కొట్టుకొని వచ్చాడు. సంఘటన స్థానానికి చేరుకున్న వెంకటాపురం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.