నాగర్ కర్నూల్, డిసెంబర్ 26,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని సింగారం గ్రామంలో శుక్ర వారం రోజు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ కొరకు వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేస్తూ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది కుమార్ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులను వేస్తూ పశుపాలకులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలం శేఖర్, ఉప సర్పంచ్ జరుపుల శివ ప్రచాండ, వార్డు సభ్యులు మల్లయ్య, రమేష్ పాల్గొన్నారు. అలాగే పాడి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పశువులకు చికిత్స చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం మెరుగుపడితేనే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
