Subscribe Us

SB LATEST:

25, డిసెంబర్ 2025, గురువారం

మాజీ ప్రధాన మంత్రి అటల్ జీ 101వ జయంతి వేడుకలు



పదర బీజేపీ నేతల ఆధ్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లను పంపిణీ చేసి బీజేపీ నాయకుల ఘన నివాళులు

నాగర్ కర్నూల్, డిసెంబర్ 25,(ఎస్ బి న్యూస్):

నేటి సమాజం లో స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చూపిన మార్గాలను అందరూ ప్రభుత్వాలు పాలకులు అనుసరించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్మరించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారత దేశ మాజీ ప్రధాని, భారతరత్న, అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వగృహం ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలాజీ మంగ్యా నాయక్, మంగ్య నాయక్, మండికారి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ,
“అటల్ జీ జీవితం, ఆయన విలువలు భారత రాజకీయాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు , అందరూ మెచ్చిన ఆ మహానుభావుని జీవితంలో మచ్చ లేని నేత అని ప్రతిపక్ష - స్వపక్ష రాజకీయ పార్టీల నేతలు కూడా కీర్తిస్తారని పేర్కొన్నారు. అటల్ జీ పుట్టినరోజును కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి, వక్తగా భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని తెలిపారు.
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో వరుసగా ఐదు అణు పరీక్షలు నిర్వహించి, ప్రపంచ ఆంక్షలను లెక్కచేయకుండా భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా నిలిపిన సాహసోపేత నిర్ణయం ఆయన నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా పాకిస్థాన్ చొరబాటుదారులను తరిమికొట్టి, భారత్ ఘనవిజయం సాధించేలా అటల్ జీ నాయకత్వం వహించారని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించారని, సర్వ శిక్షా అభియాన్ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించడంతో అక్షరాస్యత శాతం పెరిగిందని వివరించారు.
టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి మొబైల్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారని, అలాగే భారతదేశ తొలి చంద్రయాన్-1 ప్రాజెక్టుకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆమోదం లభించిందని తెలిపారు. పదర మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా గురువారం మండల అధ్యక్షులు నీలం రవి అమ్రాబాద్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదర మండల కేంద్రం లోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతు ఫ్రొక్రాన్ లో అను పరీక్షలు జరిపి కార్గిల్లో ఘన విజయం సాధించి పేదల కోసం అంతోదయ పథకం తెచ్చి పల్లె పట్టణాలకు రహదారులు వేసి రాజనీతిజ్ఞుడైన సుపరి పాలనందించి పార్లమెంట్ కె వన్య తెచ్చి జనం గుండెల్లో నిలిచి, అణువణువునా దేశభక్తి తన తనువు మనసు సర్వం భరతమాతకే అంకితం చేసిన త్యాగశీలి, అజాతశత్రువు తన మాటతో మంత్రముగ్ధుల్ని చేసిన మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కొయ్యల మల్లేష్ మాదిగ, గోలి శ్రీనివాసులు,  పగిడిపాల అనిల్,  నోముల శంకర్ గౌడ్, చంద్రయ్య యాదవ్,  ప్రతాప్ నాయక్, రంగినేని రవీందర్, మహేశ్వరి, వెంకటేష్, బయ్యా రాజు, అభినవ్ యాదవ్, నేడిగంటి అమర్‌నాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.