Subscribe Us

SB LATEST:

4, నవంబర్ 2025, మంగళవారం

కొర్రమీను పెంపకం రైతులకు లాభదాయకం : ఏపీఎం విజయ


కొర్రమీను పెంపకం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని ఏపీఎం విజయ తెలియజేశారు. మంగళవారం ఆమె పినపాక మహిళా సమాఖ్య కార్యాలయంలో మాట్లాడుతూ రైతులు కనీసం అర ఎకరం పొలం ఉంటే ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. కోరమేను సాగు చేసుకునే రైతులకు ఆక్వా నుండి నాలుగు లక్షల 50 వేల రుణం అందుతుందని తెలియజేశారు. ఆరు నెలల్లో రైతులకు లాభం మొదలవుతుందని తెలిపారు. దీనితోపాటు కౌజు పిట్టల పెంపకం, నాటు కోళ్లు, మేకలు గొర్రెలు పెంపకం చేపట్టవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు పినపాక మండలంలో గల మహిళా సమైక్య కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.