Subscribe Us

SB LATEST:

4, నవంబర్ 2025, మంగళవారం

ఉపాధి హామీ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి: ఏపీవో వీరభద్ర స్వామి


జాతీయ ఉపాధి హామీ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఏపీఓ వీరభద్ర స్వామి సూచించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం, జానంపేట, సీతంపేట, ఎలిసిరెడ్డిపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కార్డుకు ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేవైసీ చేయని వారికి ఆన్లైన్ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ సిబ్బంది మొత్తం ఈకేవైసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈ కేవైసీ ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఈ కేవైసీ చేయని వారు ఉంటే కచ్చితంగా చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిపారు.