- ప్రతిరోజు చెత్త సేకరణ, శానిటేషన్ చేయాల్సిందే
గ్రామాల్లో పారిశుధ్యం పై సెక్రటరీలు పారిశుధ్యం పై ప్రత్యేకత వహించాలని డిఎల్పిఓ సుధీర్ కుమార్ సూచించారు. మంగళవారం పినపాక మండలంలో ఆయన పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. సెక్రటరీలు విధిగా ప్రతిరోజు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరించాలని , ఆ చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. అలాగే శానిటేషన్, బ్లీచింగ్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో గ్రామపంచాయతీ పరిధిలో సెక్రటరీలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
Social Plugin