ఈ యాప్ పైన మీకు అవగాహన ఉందా... ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి: ఐటీడీఏ పీవో

 భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లా ప్రజలు మీకు తెలిసిన నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వారి DEET app ను ప్లే స్టోర్ ద్వారా వారి యొక్క ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని రిఫరల్ కోడ్ : JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని సలహా అందించి వారు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 
     ఈ యాప్ లో దాదాపు 900 కంపెనీలు DEET app ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని ఆయన అన్నారు. 
       కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరనీ ఆయన తెలుపుతూ ఇంకా ఏమయినా సమాచారం కోసం ఐ.టి.డి.ఏ,భద్రాచలం లోని రూమ్ No.13 భవిత సెల్ నందు సంప్రదించ గలరని ఆయన కోరారు.