భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ శివ నాయక్ గారి చేతుల మీదుగా 2016 దివ్యాంగుల చట్టం పోస్టర్ ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ శివ నాయక్ గారు మాట్లాడుతూ, “2016 దివ్యాంగుల చట్టంలో అనేక రకాల హక్కులు పొందుపరచబడ్డాయి. దివ్యాంగులు స్వయం ఉపాధి ద్వారా ఎదుగుతున్నారని, వారిని సమాజం ప్రోత్సహించాలి” అని అన్నారు.
అలాగే 92/A సెక్షన్ ప్రకారం దివ్యాంగులను అవమానించడం, హింసించడం లేదా పరికరాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు రెండేళ్ల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, ₹5 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ప్రతి శనివారం కోర్టులో దివ్యాంగుల ఫిర్యాదులు స్వీకరించి చట్టపరంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్నం సత్తిబాబు, అలవాల రాజా, మర్మం శంకర్, మిట్టపెళ్లి నరేంద్ర, పుప్పాల రమేష్, నానిపెళ్లి శ్రీనివాస్, ఆనందు చైతన్య, రామ రుద్రయ్య, బుద్ధ శ్రీను, క్రిష్ణ శ్రీనివాస్, జ్యోతి రమాదేవి, ఉష, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin