8 కిలోమీటర్ల కాలినడకన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
కనకగిరి గుట్టల్లో ఉన్న వీరభద్రుని కి ప్రత్యేక పూజలు
చండ్రుగొండ నవంబర్ 5( ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సాధారణ పౌరునిగా బుధవారం చండ్రుగొండ మండలం, బెండాలపాడు గ్రామ శివారులోని (కనకాద్రి) గుట్టలను సందర్శించారు. స్థానిక బెండాలపాడులోని ఆదివాసీ గిరిజనుల తో కలిసి సాధారణ వ్యక్తిగా ఉదయం ఏడు గంటల నుండి అడవిలోకి, కాలినడక తో పకృతి అందాలను ఆస్వాదించుకుంటూ, గుట్టలపై గల కాకతీయుల కాలంలో కట్టిన వీరభద్రునని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట పై కాకతీయులు నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కట్టడాలను చూస్తే ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా ఈ కట్టడాలను ప్రాచీన కాల దేవాలయం ను రక్షించుకోవడం మన బాధ్యతని, ఈ సంపదను రాబోయే తరాలకు కూడా మనం అందించాలని అని అన్నారు.. త్వరలోనే ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కనకాద్రి గుట్టపై ఉన్న వీరభద్ర స్వామి ఆలయం వద్ద, హస్తాల వీరన్న స్వామి వారి వద్ద , సమ్మక్క సారక్క గద్దల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేపిస్తానని అన్నారు. బెండాలపాడు గ్రామంలో గల వెదురుతో తయారు చేసే బ్యాంబో కస్టర్ ఆయన సందర్శించారు. గిరిజనులు తయారు చేసే వెదురు ఉత్పదలను చూసి వాళ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సౌరబ్ శర్మ, డిప్యూటీ కలెక్టర్ మురళి దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, మరకాల రవీందర్ రెడ్డి, హోటల్ నాగ, వెంకటేష్, బచ్చళ్ళ వెంకటేష్, కారం నాగేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin