నాగర్ కర్నూల్, నవంబర్ 24(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని జెపి నగర్ సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలుఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు సోమ వారంపాఠశాలనుముట్టడించారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ —
ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదనే కారణంతో సైన్స్ ఉపాధ్యాయుడు గోపాల్ 100–150 గుంజీలుతీయమని బలవంతంచేశాడని వారుఆరోపించారు. అలా గుంజీలు తీయడంతో విద్యార్థి అస్వస్థతకు గురై, రెండు రోజులకు కూడా లేవలేని పరిస్థితిలోహాస్పిటల్‌లోచికిత్సపొందుతున్నాడని తెలిపారు.
విద్యార్థి సంఘాల నేతల విచారణలో ఉపాధ్యాయుడు గోపాల్ ప్రవర్తనపై పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన సమయానికి క్లాస్‌కు రాకపోవడం, పిల్లలపై అవసరం లేని ఒత్తిడి తేవడం, తరచూ తురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఉన్నాయని సంఘాలు పేర్కొన్నాయి. గతంలో కూడా భగత్ అనే విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా,పరిస్థితి మారలేదని తెలిపారు.
ఈ ఘటనపై పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ — పూర్వం గూడా గోపాల్ ప్రవర్తనపై రెండు–మూడు సార్లు హెచ్చరికలు ఇచ్చామని,ఇప్పుడు మళ్లీ అదే ప్రవర్తనపునరావృతం చేశాడని, ఈసారి అతన్ని సస్పెండ్, చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శక తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ భరోసా ఇచ్చారు.
విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ — “గురుకులాల్లో పిల్లలపై దౌర్జన్యాలు జరిగితే మేము బాధ్యత గా మౌనంగా చూస్తూ ఉండం” అని స్పష్టం చేశాయి.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్, నాయకులు లక్ష్మణ్, అరవింద్, పృద్వి, రామానుజన్, ప్రవీణ్, బాధిత విద్యార్థి భరత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
