Subscribe Us

SB LATEST:

14, నవంబర్ 2025, శుక్రవారం

బిటిపిఎస్ సిఈ పై అసత్య ప్రచార మానుకోవాలి

బిటిపిఎస్ సిఈ పై అసత్య ప్రచార మానుకోవాలి
పినపాక:బిటిపిఎస్ సిఈ పై కావాలని కొంతమంది శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ రమేష్, ఉపాధ్యక్షులు సోంపల్లి శ్రీను అన్నారు. శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సోంపల్లి శ్రీను మాట్లాడుతూ చీప్ ఇంజనీర్ భూక్య బిచ్చన్న మీద కొన్ని పత్రికలు రకరకాల ఆరోపణలతో కథనాలు ప్రచురిస్తున్నారని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత మూడు సంవత్సరాలుగా పలు సమస్యలపై ఆయనను చాలాసార్లు కలిసినప్పుడు తమకు ప్లాంట్ విధివిధానాలు, పనులపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ సంబంధిత పనులు చేయించుకోవడం జరిగిందన్నారు. సీఈ బిచ్చన్న రాకముందు అనేక రకాలైన సాంకేతిక సమస్యలతో అంద వికారంగా ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్ నేడు అధికారులతో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్లాంట్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. లోకల్ కాంట్రాక్టర్లుగా ఉన్న తమకు నాణ్యతగా పనులు చేయిస్తూ , కాలుష్య ప్రభావా వారి గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. అలాంటి నిజాయితీ అంకితభావంతో కష్టపడి పని చేసే అధికారి మీద కొంతమంది కావాలని నిందారోపనులు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, మహేందర్, శ్రీను, వెంకటేష్, రామ్మోహన్రావు, ఎస్ ప్రసాద్ రావు, నితీష్ కుమార్, వెలదండి దిలీప్ కుమార్, నవీన్, పొనగంటి మల్లయ్య, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.