ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పినపాక అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం మాట్లాడుతూ ధాన్యం కుప్పలు కుప్పలుగా రోడ్లపై ఆరబోసి ఉండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలతో పినపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం కార్యాలయం సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కొండేరు సంపత్, కోడి రెక్కల సాయికుమార్, స్వతంత్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోండి
