పినపాక:తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యదర్శిగా పినపాక మండలానికి చెందిన బొడ్డు ఏసుబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏసుబాబు శుక్రవారం పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం పార్టీ పోట్లాడుతుందని తెలియజేశారు. 42% రిజర్వేషన్ లక్ష్యంగా బీసీలు ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శిగా నియమించిన తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు.
Social Plugin