కపాస్ కిసాన్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగం: ఏడిఏ తాతారావు

పినపాక
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కపాస్ కిసాన్ యాప్ రైతుల కోసం అందుబాటులోకి వచ్చిందని జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు తెలియజేశారు. శుక్రవారం పినపాక మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. పత్తి రైతులు దళారులను ఆశ్రయించకుండా ఈ యాప్ లో నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. అమ్మిన వెంటనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని తెలియజేశారు. పంట వివరాలు సైతం రైతులే స్వయంగా ఈ యాప్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు