మేరా యువ భారత్ స్పోర్ట్స్ మీట్ విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిగ్రీ కళాశాల (అటానమస్) లో మేరా యువ భారత్ – భీమ్ రామ్ జీ యూత్ ఆధ్వర్యంలో యువకుల కోసం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా నిర్వహించారు. కబడ్డీ, సెటిల్, రన్నింగ్ వంటి మూడు విభాగాల్లో పోటీలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. జాన్ మిల్టన్ విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ (ఇంచార్జి పీడీ), భీమ్ రామ్ జీ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రజ్వల యువజన సంఘం అధ్యక్షులు చింతమాల పాపయ్య, మధ్యల గణేష్, అరవింద్, అధ్యాపకులు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.