Subscribe Us

SB LATEST:

13, నవంబర్ 2025, గురువారం

ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్,నవంబర్,13,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం అచ్చంపేట నియోజక వర్గం లోనిఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌ను సందర్శించిన ఆయన, స్టేషన్ రికార్డులు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
స్టేషన్ ప్రాంగణంలో మొక్కలును నాటి, పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనేస్పందించాలని,డయల్–100 కాల్స్‌కుతక్షణచర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. రౌడీ షీటర్లకార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణకొనసాగించాలని, గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతోసన్నిహితంగా,గౌరవంగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ గా, ఉండాలని ఆయన సూచించారు.ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డులనిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ, ఎస్సై వెంకట్, సిబ్బంది క్రమశిక్షణను ప్రశంసించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆశా భావాన్నివ్యక్తం చేశారు.