నాగర్ కర్నూల్,నవంబర్,28(ఎస్ బి న్యూస్),: కర్నూల్ జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు పాతాళగంగ వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి దుర్మరణంపాలయినఘటన జరిగింది. ఈ విషాదకర ఘటనశుక్రవారంఉదయంఈగలపెంటలోచోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామానికి చెందిన కురుమయాదయ్య (45)తనస్నేహితులురమేష్,అఫ్రజ్‌లతో కలిసి నవంబర్ 27నశ్రీశైలంయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలంమన్ననూర్ వద్ద గురు వారం రాత్రి బస చేసిన వీరు,శుక్రవారం ఉదయం శ్రీశైల దర్శనానికి వెళ్లే ముందుపాతాళగంగ వద్ద స్నానం చేయడానికి గంగ లోకి దిగారు.
సుమారు ఉదయం 8 గంటల సమయంలో స్నానం చేస్తుండగా యాదయ్య(45) ప్రమాదవశాత్తూ లోతుకు వెళ్లి నీటిలోమునిగిపోయారు.స్నేహితులు గమనించికాపాడేలోపేఆయనప్రాణాలు కోల్పోయారు. యాదయ్య మృతి పట్లకుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు.
యాదయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈగలపెంట ఎస్ఐ జయన్న కేసు నమోదు చేసి, ఇది ప్రమాదవశాత్తు మృతిగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
