భద్రాచలం | 28-11-2025 |
🛣️ ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ప్రారంభమైన ₹1.48 కోట్లు భారీ సైబర్ మోసం!
భద్రాచలం పట్టణానికి చెందిన వ్యక్తిని finaltogloball.com పేరుతో “ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయి” అంటూ ఒక మహిళ నమ్మించి మొత్తం ₹1,48,79,000 దోచుకుంది. మొదట ₹50,000 పెట్టించగా లాభం చూపించి మరిన్ని పెట్టుబడులు పెట్టించాడు. చివరకు “డబ్బు విత్‌డ్రా కావాలంటే పన్నులు చెల్లించాలి” అంటూ మరో ₹1.16 కోట్లు అడిగింది.
🚩 ASP కార్యాలయం స్పందన — వెంటనే 1930 కాల్ చేస్తే పెద్ద మొత్తం రక్షించేవాళ్లం!
బాధితుడు 1930కి కాల్ చేసిన వెంటనే సైబర్ టీమ్ ₹7,58,000 నిలిపివేసింది. కేసు నమోదు చేసి భద్రాచలం టౌన్ SHO దర్యాప్తు చేస్తున్నారు.
✊🏼 సైబర్ నేరాలపై పోలీసులు కీలక సూచనలు:
తెలియని Trading / Betting / Share Market లింకులు నమ్మొద్దు
విదేశీ మహిళల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు – చాట్‌లు – DMలు నమ్మొద్దు
KYC / ఆధార్ / బ్యాంక్ అప్‌డేట్ పేరుతో APK ఫైళ్ళను ఓపెన్ చేయొద్దు
WhatsApp, Facebook, Instagram లో నకిలీ స్క్రీన్‌షాట్‌లకు మోసపోకండి
"Digital Arrest" అంటూ డబ్బు అడిగితే వెంటనే ఫోన్ పెట్టేయండి
➡️ ఏ పోలీస్ అధికారి ఆన్‌లైన్‌లో డబ్బు అడగడు — ఇది 100% స్కామ్
“డబ్బు రెట్టింపు – తక్కువ సమయంలో లాభం” అన్నది 100% మోసం సంకేతం
👥 సైబర్ మోసాలకు గురైతే వెంటనే:
📞 1930 – సైబర్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్
🌐 cybercrime.gov.in
— అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, భద్రాచలం
Social Plugin