Subscribe Us

SB LATEST:

20, నవంబర్ 2025, గురువారం

గర్భిణీలు ఒత్తిడిని జయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి - డాక్టర్ దుర్గాభవాని


గర్భిణీ స్త్రీలు ఒత్తిడిని నివారించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని డాక్టర్ దుర్గ భవాని సూచించారు. గురువారం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్సీ క్లినిక్ లో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో, ప్రసవానికి ముందు, తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన జాగ్రత్తలు వివరించారు. మూడవ నెల నుండి ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదన్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.