Subscribe Us

SB LATEST:

20, నవంబర్ 2025, గురువారం

సెక్రటరీలు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలి: ఎంపీడీవో సంకీర్త్


గ్రామాల్లో తమ పరిధిలో ఉన్న సమస్యలపై సెక్రటరీలు దృష్టి సారించాలని ఎంపీడీవో సంకీర్త్ సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెక్రటరీలు, ఉపాధి హామీ కార్యాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. శానిటేషన్, గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణ క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. అలాగే ఇంటి పన్నుల వసూలు 100% పూర్తి చేయాలన్నారు. వివరాలను రిజిస్టర్ లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు . ఈ సమావేశంలో ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, గ్రామ సెక్రటరీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.